30, మే 2022, సోమవారం

🌺మంగళవారం 31st మే 2022🌺


 

 అమావాస్య హనుమాన్ పూజ


అమావాస్యనాడు హనుమంతుని ప్రార్థన అమోఘమైన ఫలితాలు ఇస్తుంది

ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున హనుమంతునిని ప్రార్థిస్తే.. సకల సంపదలు చేకూరుతాయి. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి.

 ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున నిష్టతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.


అందుచేత అమావాస్య సాయంత్రం పూట మహిళలు, పురుషులు ఆంజనేయ స్వామికి నేతితో దీపమెలిగించి.. హనుమంతుడి ఆలయాన్ని 18 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం, సకలసంపదలు, ఉన్నత పదవులు లభిస్తాయి


ఇంకా 

"అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిమ్ వద

రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో "


అనే మంత్రాన్ని 9 సార్లు పఠించి.. కర్పూర హారతులు సమర్పించుకున్న వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయి.ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి


ఆపదుద్ధారక శ్రీ హనుమత్ స్తోత్రం..


ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీహనూమతే ।

అకస్మాదాగతోత్పాతనాశనాయ నమోస్తు తే ॥ ౧॥


సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ ।

తాపత్రయస్య సంహారిన్నాఞ్జనేయ నమోస్తు తే ॥ ౨॥


ఆధివ్యాధిమహామారిగ్రహపీడాపహారిణే ।

ప్రాణాపహన్త్రే దైత్యానాం రామప్రాణాత్మనే నమః ॥ ౩॥


సంసారసాగరావర్తాగతసమ్భ్రాన్తచేతసామ్ ।

శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోస్తు తే ॥ ౪॥


రాజద్వారే బిలద్వారే ప్రవేశే భూతసఙ్కులే ।

గజసింహమహావ్యాఘ్రచోరభీషణకాననే ॥ ౫॥


మహాభయేఽగ్నిసంస్థానే శత్రుసఙ్గసమాశ్రితే ।

శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమో నమః ॥ ౬॥


ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరన్త్యఞ్జనాసుతమ్ ।

అర్థసిద్ధియశఃకామాన్ ప్రాప్నువన్తి న సంశయః ॥ ౭॥


కారాగృహే ప్రయాణే చ సఙ్గ్రామే దేశవిప్లవే ।

యే స్మరన్తి హనూమన్తం తేషాం నాస్తి విపత్తయః ॥ ౮॥


వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయామితతేజసే ।

నమః ప్లవగసైన్యానాం ప్రాణభూతాత్మనే నమః ॥ ౯॥


దుష్టదైత్యమహాదర్పదలనాయ మహాత్మనే ।

బ్రహ్మాస్త్రస్తమ్భనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే ॥ ౧౦॥


జప్త్వా స్తోత్రమిదం పుణ్యం వసువారం పఠేన్నరః ।

రాజస్థానే సభాస్థానే వాదే ప్రాప్తే జపేద్ధ్రువమ్ ॥ ౧౧॥


విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః ।

సర్వాపద్భ్యో విముచ్యేత నాత్ర కార్యా విచారణా ॥ ౧౨॥


మంత్రం:

మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక |

శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయ భో హరే ||

ఇతి శ్రీ విభీషణ కృతం సర్వాపదుద్ధాకర శ్రీ హనూమత్ స్తోత్రం ||


**

25, మే 2022, బుధవారం

🌹🔱నవ దిన కాశీ యాత్ర🔱🌹

 🌹🔱నవ దిన కాశీ యాత్ర🔱🌹


🌹కాశీలో 9 రోజులు ఉండాలి అనడంలో ఆంతర్యం ఏమిటి..


🙏మనిషి తల్లి గర్భం లో తొమ్మిది నెలలు ఉంటాడు. జన్మ రాహిత్యం ఇచ్చేది కాశి ఒక్కటే.. అందుకని వ్యాస మహర్షి కాశీ లో తొమ్మిది నెలలు దీక్ష లో ఉండి, అ తర్వాత స్వగ్రామం చేరి మంచి రోజు చూసి పూజ చేయాలి అని చెప్పాడు..అయితే కలికాలం లో ఇంత శ్రద్ధతో అంతకాలం ఉండలేమని ఇంకేదైనా ఉపాయం చెప్పమని సామాన్యులు కోరారు.. దానికి అయన తొమ్మిది రోజులుంటే ఆ ఫలితం ఢోకా లేకుండా వస్తుంది అని చెప్పాడు. అలానే ఇప్పుడు సమయం ఉన్న వారందరూ కాశి లో తొమ్మిది రోజులుండి వస్తున్నారు..


🌹మరి ఆ రోజుల్లో ఏం చెయ్యాలి🌹


🙏విశ్వేశ్వర నామ స్మరణ,

దానాలు చేయటం,

ధర్మ ప్రసంగాలు వినటం,

ఏక భుక్తం, ప్రాతఃకాల స్నానం,

ఉదయం, రాత్రి విశ్వేశ్వర దర్శనం,

కోపం లేకుండా ఉండటం,

అబద్ధమాడకుండా ఉండటం,

అనే ఎనిమిది అంశాలు ఖచ్చితంగా అమలు చేయాలి..


🌹మొదటి రోజు కార్యక్రమం


🙏ఆగత్య మణి కర్న్యామ్తు –

స్నాత్వా దత్పధనంబహు –

వపనం కారయిత్వాతు –

స్నిత్వా శుద్ధాహ్ వయోవ్రతః

సచేల మభి మజద్యా ధ–

కృతా సంధ్యాధిక క్రియాహ్

సంతర్ప్య తర్మ్యాద పిత్రూన్ –

కుశ గంధ తిలొదకైహ్’’


🙏మొదటిగా మనసులో ముప్పది మూడు కోట్ల దేవతలు, తీర్ధాలతో సర్వ పరివారంతో సేవింప బడుతున్న... శ్రీ కాశీ విశ్వేశ్వరా !శరణు !అనుజ్ఞ ! అని స్మరించుకొని మణి కర్ణికా తీర్దానికి వెళ్ళాలి. దీనినే చక్ర తీర్ధం అంటారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మహా దేవుని సేవలో ఇక్కడ ధన్యమైనాడు. శివుడికి పార్వతి తర్వాత ఇష్టమైన వాడు విష్ణువే . అందుకే ‘’నారాయణీ సహా చరయ నమశ్శివాయ ‘’అన్నారు.. 

విష్ణు సేవా ఫలితం గా ఏర్పడిన మణికర్ణిక కు గొప్పదనాన్ని ఆపాదించాడు విశ్వేశుడు..

యాత్రీకులు మణికర్ణిక లో స్నానం చేయాలి. బ్రాహ్మణులకు దానాలు చేయాలి..కేశఖండనం చేసుకొని మళ్ళీ స్నానం చేయాలి..

మహేశ్వరాదులను అర్చించి మళ్ళీ స్నానం చేయాలి..

రుద్రాక్ష మాల ధరించి ఈ కింది శ్లోకం చదువు కోవాలి....


’కిము నిర్వాణ పదస్య భద్ర పీతం – మృదులం తల్ప మదోను మోక్ష లక్స్యః

అధవా మణి కర్ణికా స్థలీ పరమానంద సుకాండ జన్మ భూమి చరా చరేషు సర్వేషు- యావంతస్చ సచేతనః –తావంతిహ్ స్నాంతి మధ్యాహ్నే – మణి కర్నీజతే మలే.. 

ఆ గంగా కేశవస్చైవ –

ఆ హరిన్ద్రస్చ మండ పాత్ –

ఆ మద్ధ్యా ద్దేవ సరితః 

స్వర్ద్వారా న్మణికర్ణికా 

నమస్తే నమస్తే నమః‘’.....

అని నమస్కరించి అక్కడ నుండి డుండి వినాయకుడిని దర్శించి 21 గరికలను ,21 కుడుములను సమర్పించి , 21 సార్లు గుంజీలు తీసి 21 రూపాయలు దక్షిణ గా సమర్పించాలి.

దున్దీ రాజ గణేశాన –

మహా విఘ్నౌఘనాశన –

నవాఖ్యాదిన యాత్రార్ధం –

దేహ్యాజ్ఞానం కృపయా విభో’’

అని ప్రార్ధించాలి . తర్వాతా అన్నపూర్ణా దేవిని సందర్శించాలి. ఆ తర్వాతా విశాలాక్షి , జ్ఞానవాపి, సాక్షి గణపతులను చూడాలి..

ఇది పూర్తీ చేసి నివాసం చేరి భోజనం చేయాలి. రాత్రికి విశ్వనాదుడిని దర్శించాలి..

ఫలాలు, పాలు ఆహారంగా గ్రహించాలి.


 ‘’హర సాంబ హర సాంబ సాంబ సాంబ హరహర –హర శంభో హర శంభో –శంభో శంభో హరహర మహాదేవ మహాదేవ విశ్వనాధ శివ శివ –

మహాకారి మహా కారి రక్ష రక్ష హరహర ‘’

అంటూ పదకొండు సార్లు భజన చేసి నిద్రపోవాలి.


🌹రెండవ రోజు కార్యక్రమం


🙏రెండో రోజు ఉదయానే గంగా స్నానం చేసి విశ్వేశ్వర , అన్నపూర్ణా దర్శనం చేయాలి. మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణి కర్ణికా 

ఘట్టం లో స్నానం చేయాలి. తీర్ధ శ్రాద్ధం చేయాలి. వెయ్యి సార్లు గాయత్రీ జపం చేయాలి.. గురు ఉపదేశం తో ....

‘’శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః ‘’ అనే మంత్రాన్ని వెయ్యి సార్లు జపించాలి. మధ్యాహ్నం విశ్వేశుని దర్శించి సాయంత్రం కూడా మళ్ళీ దర్శించాలి. రాత్రి ఫలహారం చేసి పడుకోవాలి .


🌹 మూడవ రోజు కార్యక్రమం


🙏తెల్లవారక ముందే అసీ ఘాట్ లో సంకల్ప స్నానం చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి.. తర్వాత దశాశ్వ మేధ ఘాట్ కు చేరాలి. దీనికి ‘’రుద్ర సరోవర తీర్ధం ‘’అనే పేరు కూడా ఉంది.. ఇక్కడ స్నానం చేసి శీతలా దేవిని దర్శించాలి .వరుణా ఘాట్ కు వెళ్లి స్నానం చేసి ఆదికేశవ స్వామిని దర్శించాలి. పంచనదీ తీర్ధమైన బిందు మాధవ ఘట్టం లో సంకల్ప స్నానం చేయాలి. 

కిరణ దూత పాపాచ – పుణ్య తోయా సరస్వతీ గంగాచ యమునా చైవ –

పంచ నద్యోత్ర కీర్తితః ‘’

అని స్మరిస్తూ స్నానం చేయాలి .


తర్వాతా బిందు మాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి. మణి కర్నేశుని, సిద్ధి వినాయకుని దర్శించి పూజించాలి.. అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం కావించి నివాస స్థలం చేరి భోజనం చేయాలి. రాత్రికి పాలు , పండ్లు మాత్రమె స్వీకరించాలి .


🌹నాల్గవ రోజు కార్యక్రమం


🙏ఉదయమే గంగా స్నానం విశ్వేశరుడి దర్శనం చేసి డుండి వినాయకుడిని చూసి దండ పాణి అయిన కాల భైరవుని పూజించాలి..

కాశీ క్షేత్ర రాజ్యాన్ని మనసు లో స్మరించి..

 ‘’ఓం కాశ్యై నమః ‘’అని 36 సార్లు అనుకోవాలి. తర్వాత బిందు మాధవుని దర్శించాలి.. గుహను, భవానీ దేవిని దర్శించాలి. ఇలా మధ్యాహ్నం వరకు తొమ్మిది దర్శనాలు చేసి మణి కర్ణిక చేరి మట్టి లింగాన్ని పూజించి మళ్ళీ అన్నపూర్ణా విశ్వేశులను దర్శించి భోజనం చేయాలి. రాత్రి నామ స్మరణ పాలు,పండ్లు ఆహారం... అంటే ఈ రోజు పది దర్శనాలన్న మాట.


🌹అయిదవ రోజు కార్యక్రమం


🙏ప్రాతఃకాలమే గంగా స్నానం చేసి కేదారేశ్వరుని దర్శించి అక్కడే రుద్రాభిషేకం నిర్వహించాలి.. తర్వాతా తిలా భాన్దేశ్వర , చింతామణి గణపతిని సందర్శనం చేయాలి.. దుర్గా దేవిని చూసి ఒడి బియ్యం దక్షిణా సమర్పించి గవ్వలమ్మ ను చేరి అదే విధంగా పూజ చేయాలి.. ఈమెనే కౌడీబాయి అంటారు..

అన్నపూర్ణా విశ్వనాధ దర్శనం చేసి, భోజనం చేసి రాత్రి పాలు, పండ్లు తీసుకోవాలి.


🌹ఆరవ రోజు కార్యక్రమం


🙏సూర్యోదయానికి పూర్వమే గంగా స్నానం చేసి బ్రాహ్మణ ముత్తైదువులకు పూజ చేసి ఆశీస్సులు పొంది, వైధవ్యం ఎన్ని జన్మలకైనా రాకూడదని దీవెనలు పొంది మూసి వాయన చేటల దానాన్ని చేసి, బేసి సంఖ్యలో జనానికి వాయన దానాన్ని చేయాలి..

వ్యాస కాశీ చేరి వ్యాసుని, రామలింగేశ్వరుని,

శ్రీ శుకులను దర్శించి.., కాశీ వచ్చి అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేయాలి.. తర్వాత భోజనం చేయాలి.. రాత్రి సంకీర్తనతో కాలక్షేపం చేసి పాలు, పండ్లను స్వీకరించాలి.


🌹ఏడవ రోజు కార్యక్రమం


🙏గంగాస్నానం, నిత్య పూజా చేసి వెయ్యి గరిక లను ఏరి సిద్ధం చేసుకోవాలి. దొరక్కపోతే నూట ఎనిమిది తో సరి పెట్టుకోవాలి. ఇరవై ఒక్క ఉండ్రాళ్ళను, నూట ఎనిమిది యెర్ర పూలతో పూజించాలి.. ముగ్గురు బ్రాహ్మణ ముత్తైదువు లకు భోజనం పెట్టి తాంబూలాలు ఇవ్వాలి..


డుండి వినాయకుడిని అర్చించి , అన్నపూర్ణా ఆలయంలో కుంకుమ పూజ చేయించాలి. అమ్మవారికి చీరా జాకెట్టు, ఒడిబియ్యం , గాజులు సమర్పించాలి... ఇలాగే విశాలాక్షి కీ చేయాలి . విశ్వేశునికి అభిషేకం చేయాలి. సహస్ర పుష్పార్చన.., సహస్ర బిల్వార్చన ,

హారతి ఇచ్చి తీర్ధ ప్రసాదాలను స్వీకరించాలి. హర సాంబ హర సాంబ అంటూ పదకొండు సార్లు జపం చేయాలి..


🌹ఎనిమిదో రోజు కార్యక్రమం


🙏గంగాస్నానం, నిత్యపూజా తర్వాత కాల భైరవుడిని దర్శించి వడలు, పాయసం నివేదించాలి. ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి. ఆ రోజంతా కాల భైరవ స్మరణతో నిష్టగా గడపాలి.. అయిదుగురు యతులకు, ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలకూ భోజనం పెట్టాలి.

దక్షిణా తాంబూలం సమర్పించాలి... భోజనం చేసి రాత్రి కాల భైరవ స్మరణ చేస్తూ 

నిద్ర పోవాలి.


🌹తొమ్మిదో రోజు కార్యక్రమం


🙏గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్ణా దేవిని దర్శించి, పూజించి,

నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి.. జ్ఞానులైన దంపతులను పూజించి భోజనం పెట్టి దక్షిణ లివ్వాలి.. ఆశీస్సులు పొందాలి..

రాత్రి అన్నపూర్ణాష్టకం చేసి నిద్ర పోవాలి .


🌹పదవ రోజు కార్యక్రమం*


🙏నవ దిన యాత్ర పూర్తీ చేసి పదవ రోజు గంగా స్నానం చేసి గంగను పూజించి సహస్ర నామ పూజ చేసి, అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసి తలిదండ్రులను, గురు దంపతులను పూజించాలి.. అందరి ఆశీర్వాదాలు పొంది ఇంటికి ప్రయాణమవ్వాలి....


ఇలా చేస్తే విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది....

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ 


🙏🌹🙏🌹🙏🌹

🙏🌹🙏🌹🙏🌹

🙏🌹🙏🌹🙏🌹


ఓం శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః

అమ్మ సృష్టికర్త. అమ్మ తన కడుపును గర్భాలయం చేసి మరణ సదృశమైన వేదనను పొంది బిడ్డకు జన్మనిస్తుంది,

*బిడ్డ పుట్టిన రోజే అమ్మకు కూడా పుట్టినర

అమ్మ సృష్టికర్త. అమ్మ తన కడుపును గర్భాలయం చేసి మరణ సదృశమైన వేదనను పొంది బిడ్డకు జన్మనిస్తుంది, అందుకే ప్రతి బిడ్డ పుట్టినరోజు అమ్మకు కూడా పుట్టిన రోజే. బిడ్డ అమ్మ శరీరంలో అంతర్భాగం. ఈవేళ మనకున్న శరీరం అమ్మ కడుపులో పుట్టి పెరిగిందే కదా! పుట్టినది మొదలు మల మూత్రాదులను శుభ్రం చేసి, పెంచి పెద్దచేసి, ఆఖరి ఊపిరిలో కూడా పిల్లలు కష్టపడకూడదని, తాను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పైకి చెప్పకుండా పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ తన ఆయుర్దాయం కూడా పిల్లలకు ఇవ్వమని ప్రార్థించే అమ్మ లాంటి వ్యక్తి ఈ లోకంలో మరొకరు ఉండరు. అమ్మే ఈ శరీరాన్ని ఇవ్వకపోతే మనకు ఈ శరీరం ఎక్కడిది ?  


మన సుఖ సంతోషాలకు మన కీర్తిప్రతిష్ఠలకు మూలమయిన ఈ శరీరం అమ్మ ప్రసాదించిందే. అమ్మను మించిన దైవం ఎక్కడుంది? అందుకే వేదం మొదటి నమస్కారం అమ్మకు చేయించింది– మాతృదేవోభవ–అని. మిగిలిన అందరికీ పుట్టిన రోజు ఒక్కటే కానీ అమ్మకు మాత్రం తాను స్వయంగా జన్మించిన రోజున ఒక పుట్టిన రోజుతోపాటూ, ఎంతమంది బిడ్డల్ని కంటుందో ఆమెకు అన్ని పుట్టినరోజులుంటాయి. అంటే అమ్మకు ఇద్దరు బిడ్డలుంటే మూడు పుట్టినరోజులుంటాయి. స్త్రీగా తన పుట్టినరోజును భర్త వేడుకగా చేస్తే, మిగిలిన పుట్టిన రోజులను బిడ్డలు తమకు జన్మనిచ్చినందుకు కృతజ్ఞతగా మొదట ఆమెకు కొత్త బట్టలు పెట్టి తరువాత తాము వేసుకుని వేడుక చేసుకోవాలి.


స్త్రీగా కూడా ఆమె పుట్టిల్లు, అత్తవారిల్లు... రెండింటి క్షేమాన్నీ ఆకాంక్షిస్తుంది. తల్లిగా రెండు వంశాలను తరింప చేస్తుంది. ధర్మపత్నిగా పురుషుడికి యజ్ఞయాగాది క్రతువుల నిర్వహణకు అర్హుడిని చేస్తుంది. భగవంతుడు ఎక్కడో ఉండడు, అమ్మరూపంలోనే మనకు అందుబాటులో ఉంటాడు. అందుకే బద్దెనగారు ‘‘నీరే ప్రాణాధారము, నోరే రసభరితమైన నుడువులకెల్లన్‌/నారియె నరులకు రత్నము/ చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ!’’ అన్నారు. మనుషులలో రత్నం అంత గొప్పది స్త్రీ అంటున్నారు.


అలాగే ‘చీరయె శృంగారమండ్రు...’ అన్నారు. చీర అంటే స్త్రీలు ధరించేదని కాదు. రాముడు నార చీరెలు కట్టుకున్నాడు అంటారు. చీర– అంటే వస్త్రం. శృంగారం అంటే పరమ పవిత్రమయిన అలంకరణ, శుద్ధమయినది... అని! కట్టుకున్న బట్టను బట్టి మనిషి జీవన విధానం తెలుస్తుంటుంది. వేల ఖరీదు చేసే వస్త్రాలే కట్టుకోవాలనే నియమం ఏదీ ఉండదు. ఏది కట్టుకున్నా బట్ట పరిశుభ్రంగా, ప్రకాశవంతంగా ఉండాలి. నిజంగా కష్టంలో ఉండి నిస్సహాయ పరిస్థితుల్లో తప్ప మనిషి ఎప్పుడూ పరిశుభ్రమైన వస్త్రాలనే ధరించాలి. పిల్లలు మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.


ఎవరి బట్టలు వారు శుభ్రం చేసుకోవడం చిన్నప్పటినుండే అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మీకు పరిశుభ్రత మీద ఆసక్తి పెరగడమే కాక, అమ్మ కష్టాన్ని కూడా తగ్గించిన వారవుతారు. మన సంప్రదాయం ప్రకారం బయట ఎక్కడికి వెళ్లి వచ్చినా ముందుగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి, బయట తిరిగొచ్చిన బట్టలు మార్చుకోవాలి. విడిచిన బట్టలు, తడి బట్టలు ఇంట్లో ఎక్కడంటే అక్కడ కుప్పలుగా వేయకుండా వాటి స్థానాల్లో వాటిని ఆరేయడమో, తగిలించడమో చేయాలి. అది మన శరీరానికి, పరిసరాలకే కాదు, మన ప్రవర్తనకు, మన శీలానికి, మన వ్యక్తిత్వానికి అలంకారం. అది మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. బద్దెన గారు చెప్పినవి చిన్నచిన్న మాటలే అయినా మన జీవితాలను చక్కటి మార్గంలో పెట్టే సూత్రాలు.

 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు

శాస్త్రమునందు హనుమకు వివాహం అయింది. ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు ప్రవర ఉన్నది. తండ్రిగారు కేసరి, తాతగారి పేరు, ముత్తాతగారిపేరు కళ్యాణంలో చెప్తారు. హేమగర్భుడు అని వారి ముత్తాతగారి పేరు. ఒకతండ్రి కడుపున పుట్టిన పిల్లవాడు వివాహం చేసుకోకుండా ఉండిపోతే తల్లిదండ్రులు దేహములు చాలించిన తరువాత వారి శరీరాలను చెట్లకి త్రిప్పి కట్టేస్తారు. ఎందుకంటే నువ్వు వివాహం చేసుకోనటువంటి సంసార భ్రష్టుడిని కన్నావు కనుక అని. అందుకని పిల్లలు వివాహం చేసుకోకుండా ఉండకూడదు. అలా చేయడం తల్లిదండ్రులయొక్క ప్రధానమైన బాధ్యత. నవ వ్యాకరణపండితులు, మహా బుద్ధిమంతుడైన హనుమ వివాహం చేసుకోకుండా అటు సన్యాసం తీసుకోకుండా ఉండరు కదా! మీకు అందుకే భారతీయ సంప్రదాయంలో ఋషులందరూ వివాహం చేసుకొని ఉంటారు. అలాగే హనుమ కూడా శాస్త్రమునకు సంబంధించినంతవరకు గృహస్థాశ్రమంలో ఉంటారు. కాపురం చేసినట్లు, పిల్లల్ని కన్నట్లు లేదు. ఎందుకంటే ఆయన బ్రహ్మజ్ఞాని. అందుచేత సువర్చలను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ యోగమును అనుసంధానం చేశారు.

 హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము, 

నైమిత్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు

5, మే 2022, గురువారం

Panchangam 6th Friday May 2022🌺శుక్రవారం 6th మే 2022🌺


 

 రేపటి రోజు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల యొక్క ఆవిర్భావ దినం. ఇది సనాతన ధర్మం అంతటికీ పండుగరోజు. 


 ఎంతవరకూ దేహమే నేను అనే భావం ఉంటుందో అంతవరకూ వైదికమైన సత్కర్మలు ఆచరించాలి. 

షణ్మతాలూ ఈ మూడు సిద్ధాంతాలతో ఉంటాయి. 

ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతములు X షణ్మతములు = హిందూ ధర్మం యొక్క స్వరూపం.


అద్వైతం అనే ఒకానొక జ్ఞానం భూమికగా కలిగి ఉన్నట్లయితే పరస్పర వైరములు లేకుండా ఉంటాయి. అందుకే ఆదిశంకర భగవత్పాదుల వారు అద్వైతం ప్రతిష్ఠాపన చేస్తూ “ఉన్నది ఒక్కటే పరమాత్మ తత్త్వము. జీవుడికి కూడా దేహాత్మ భ్రాంతి ఉన్నంతవరకే భేదం కానీ అది తొలగించి చూస్తే సత్య దృష్టితో అద్వైతమే” అని చెప్పారు. 

వ్యవహారంలో అద్వైతం కుదరదు, ద్వైతమే ఉంటుంది. పరమార్థంలోనే అద్వైతం. పారమార్థిక దృష్టి కలిగి వ్యవహార జీవనంలో ఉన్నప్పుడు అద్వైత స్పృహలోనే ద్వైత జగత్తులో ఉంటాం. దీనివల్ల సమాజంలో ఒక శాంతి ఏర్పడుతుంది. 


సిద్ధాంతాలు అర్థం అయినా అవకపోయినా శంకర సిద్ధాంతంలో ఉన్న వారికి ఎవరి ఇష్టదేవతలు వారికి ఉన్నా ఇతర దేవతలను ద్వేషించరు. అది ఒక్కటి చాలు ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచే పద్ధతి. 


వైష్ణవంలోను, శైవంలోనూ మహాత్ములు, ఉద్దండులూ ఉద్భవించారు. గొప్పగొప్ప భక్తులు ఉన్నారు. వారు ముక్తజీవులే. కానీ వారి అనుయాయులం అని చెప్పుకొనే వారిలో ప్రస్తుతం ఉన్నవారు శివద్వేషం వైష్ణవంగాను, విష్ణుద్వేషం శైవంగాను, చలామణి అవుతోంది. వీరికి ఇతర మతముల పట్ల విపరీతమైన ద్వేషం. 


చాలామందికి శంకరాచార్య అంటే శైవుడని, రామానుజాచార్య అంటే వైష్ణవుడనీ, ఒకానొక భ్రమ బాగా ఉంది. రామానుజులు కేవల వైష్ణవ మతస్థులు అనడంలో ఏమీ సందేహం లేదు. ఆయన ఇతర దేవతలను ప్రశంసించరు. మీదు మిక్కిలి వారి అనుయాయులు శివాదులను ద్వేషించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇతర దేవతలు అంటే వారికి గిట్టదు. అవమానంగానే చూస్తారు. తపనిసరియై నోరుమూసుకున్నప్పటికీ మనస్సు నిండా కించపరచే భావమే వారికి ఉంటుంది. 


శంకరాచార్య శైవులు కాదు. ఆయన శివాంశ సంభూతులు అని శంకర విజయాలు చెప్పాయే తప్ప ఆయన శైవుడు కాదు. 

వైదిక శైవం గురించి చెప్పాలంటే శ్రీకంఠాచార్యులు, వీరశైవం బసవేశ్వరులు మొదలైన వాళ్ళు ఇచ్చారు.

శైవం వేరు, వైష్ణవం వేరు, శాక్తేయులూ ఉన్నారు. వారందరూ ఆగమ మతాలు. కానీ శంకరాచార్యులు వీటి వేటికీ చెందరు. ఆయనకి శివుడు, విష్ణువు, భేదం లేదు. ఉన్నది ఒక్కటే పరమాత్మ. ఆయన నిర్గుణుడు, నిరాకారుడు. కానీ భక్తులు ఉపాసనా సౌలభ్యం కోసం ఆయన అనేక రూపాలు స్వీకరిస్తాడు. విష్ణువు, శివుడు ఒకే పరమాత్మ నామములే. ఆ పరమాత్మ ప్రతి జీవుడిలో అంతర్యామియే. తత్త్వతః తెలుసుకోగలిగితే జీవుడికీ పరమాత్మకీ భేదం లేదు. ఇది శంకర సిద్ధాంతం.

శంకరులు ఎప్పుడూ శైవం కాదు, ఇది ముందు తెలుసుకోవాలి. 

ఈ వైష్ణవం అనుకొనే ఇతర దేవతా ద్వేషం కలిగినటువంటి వారు శంకరులు శైవులు అని ఒక ముద్ర వేస్తున్నారు. శంకరుల ధర్మంలో శైవం, వైష్ణవం అన్నీ కలిసి ఉంటాయి. షణ్మత ప్రతిష్ఠాపనాచార్య అనే పేరు కూడా ఉన్నది. 


ప్రస్తుతం సనాతనధర్మం కలిసికట్టుగా ఉండాలంటే ఎవరి సంప్రదాయం వారు పాటించాలి. ఇతర సంప్రదాయాలను గౌరవించాలి. ఇది సత్సంప్రదాయం. చాలా అవసరం. 


వైష్ణవులు వైష్ణవంలో ఉన్న వారికి వైష్ణవ ధర్మాలను బోధించడం చేయాలి. ఇతరులకి విష్ణుభక్తిని బోధించాలి. అలాగే శైవులు కూడా శైవసంప్రదాయంలో ఉన్నవారికి శైవ దీక్షలు ఇప్పించవచ్చు. ఇతరులకు శివభక్తి బోధించవచ్చు. కానీ అందరు దేవతలను ఆరాధించుకొనే సంప్రదాయంలో ఉన్నవారిని బలవంతంగా మార్చి, వారికి శివుడి ఆలయాలకు వెళ్ళవద్దు, శివపూజలు చేయవద్దు, శివుడు అంటే అష్టదిక్పాలకులలో ఒకడు, ఏకాదశ రుద్రులలో ఒకడు అంటూ కించపరచి మాట్లాడడం జరుగుతోంది. ఇది చాలా బాధాకరమైన విషయం. 

ఇతరులు మన దేవతలను అవమానిస్తూ మతమార్పిడులు చేయడం ఎలాంటిదో మన మతంలో ఉపమార్పిడులు కూడా అటువంటివే. 


రాజకీయ ప్రాపకాలు, ప్రభుత్వ అండదండలు దగ్గర పెట్టుకొని ఇలాంటి దాష్టీకాలు చేస్తూ సనాతన ధర్మంలో చీలికలు ఎవరైతే తీసుకువస్తున్నారో వాళ్ళు జగద్గురువులు అనడానికి లేదు. వాళ్ళ శాఖకి వాళ్ళు గురువులు అంతే.


సనాతన ధర్మం వేదంలోనుంచి వచ్చిన ఆరుమతాలనూ చూపిస్తూ ఎవరి దేవతలను వారు ఆరాధించుకోండి, ఇతరులను గౌరవించండి.


హిందూధర్మం మొత్తానికి ఒక గురువును చెప్పుకోవాలంటే ఆ గురువు ఆదిశంకర భగవత్పాదులు మాత్రమే. ఆయన వచ్చిన తరువాతనే అవైదిక మతాల ధాటికి చెదిరిపోయినటువంటి శైవవైష్ణవాదులు తిరిగి ఊపిరి పోసుకున్నాయి. అందుకే ఆయనని “షణ్మతప్రతిష్ఠాపనాచార్య’ అన్నారు. 


సనాతన హిందూ ధర్మానికి సమగ్రమైనటువంటి జగద్గురువులుగా ఆదిశంకరులను గౌరవిస్తూ వారి సంప్రదాయ గురువులను గౌరవించుకోవచ్చు. తప్పులేదు. 

 అన్ని రకాల సంప్రదాయాలు ఆ సంప్రదాయంలోని గురువుల వల్లనే పుష్టి పొందాయి. ఈ సంప్రదాయాలన్నింటినీ గౌరవించడం అనే సంప్రదాయం మాత్రం జగద్గురువులు ఆదిశంకర పరంపరలో ఉంది నేటికి కూడా. శంకర పీఠములన్నింటిలోని వారూ ఇటువంటి సామరస్య ధోరణితో ఉన్నటువంటి వారే. పీఠ పరిపాలిత దేవాలయాలలోనూ హైందవ దేవతలందరూ ఆరాధింపబడుతూ ఉన్నారు. నారాయణ స్మరణ, చంద్రమౌళీశ్వరారాధన, శ్రీచక్రార్చన చేస్తారు. సనాతనధర్మం యొక్క స్వరూపం ఇది. 


ప్రతి సంప్రదాయం వాళ్ళూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం వారి సంప్రదాయం వదులుకోకుండా ఇతర సంప్రదాయాలను గౌరవించడం నేర్చుకోవాలి. విష్ణువే గొప్ప శివుడు కాదు అని వాళ్ళ గ్రంథాలను భుజాన మోసుకొని ఎలా తిరుగుతున్నారో, శివుడు తప్ప ఇంకెవరూ గొప్ప కాదు అని చెప్తూ గ్రంథములు మోసుకు తిరగడానికి వాళ్ళూ సిద్ధంగా ఉన్నారు. ఏ నూతిలో మండూకానికి ఆ నూతి లోతు తెలిసినట్లు ఏ సంప్రదాయజ్ఞుడికి ఆ సంప్రదాయపు లోతు తెలుస్తుంది. తమకు తెలియని సంప్రదాయాల గురించి అవహేళనగా, కించపరచి మాట్లాడరాదు. సందర్భం వస్తే అది మా సబ్జెక్ట్ కాదు అని నమస్కారం చేయడం చాలా మంచిది.  


సనాతనధర్మం పరస్పర ద్వేషాలు, చీలికల జోలికి వెళ్ళకుండా సమన్వయ ధోరణిలో వెళ్ళాలి అని ఒక సంకల్పం తీసుకోవాలి. ఇక ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతాల గొడవ పండితులు ఎలాగూ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. సామాన్యులకి అవి అవసరం లేదు. ధర్మము, భక్తి – ఈ రెండూ చాలా ప్రధానం. 


మనది మనం పాటిద్దాం, ఇతరులను గౌరవిద్దాం. ఈ సంప్రదాయాన్నిమనకు బోధించిన జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల పాదపద్మాలకు నమస్కరిద్దాం.

 _*🚩ఆదిశంకరాచార్య జయంతి🚩*_        


*జగద్గురు ఆదిశంకరాచార్యులు*


హిందూ మత పరిరక్షణ కొరకు అవతరించిన సరళ సిద్ధాంతవేత్త ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరులు , శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు , మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం.


*శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్ !*

*నమామి భగవత్పాదం శంకరం లోకశంకరమ్ !!*


*ఆది శంకర జయంతి*


ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు , మతాలూ పుట్టుకొచ్చి , ప్రజలకి సనాతన ధర్మం పట్ల , భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. శ్రౌత , స్మార్త క్రియలను సుప్రతిష్టితం చేసి , వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం


*దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే !*

*స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః !!*


దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (శివరహస్యము నుండి)


*కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః !*

*శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా !!*


శ్రౌత , స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి , వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుండి)


జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం) శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు , శని , గురుడు , కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ , శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ , శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి , ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందినారు. పార్వతీ దేవి , సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో , ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం చెబుతోంది. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నప్పటికీ , కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారం , ఆయన జీవన కాలం క్రీ.పూ.509 – క్రీ.పూ. 477 అని తెలియవస్తోంది.


ఆయన తన రెండవ ఏటనే రాయడం , చదవడం గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేసారు. ఏడవ సంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేసారు. కారణజన్ములైన శంకరాచార్యులవారు , సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదా చార్యులవారి చెంత శాస్త్రాధ్యాయనం చేశారు.


☘ ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను త్రావించి తన కరుణాకటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది. 


☘ ఇంకొకసారి ఆయన వేదాభ్యసన సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా , ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరి కాయను ఆయనకు ఇచ్చివేసింది. ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ. *“ కనకధారా స్తవం ”* ఆశువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది.


☘ శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజూ స్నానానికై వెళ్ళలేకపోవడం గమనించి

అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి , నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహం మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. తన తపశ్శక్తి తో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేటట్లు చేసారు. 


☘ ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది. సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది. ఆయన తల్లిని తనను సన్యసించడానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుందని , అనుమతినివ్వమనీ ప్రార్థించారు. తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది. ఈ సంసారబంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నయనీ , ఆ బంధాలనుండి తనను తప్పించమనీ ఆయన తల్లిని వేడుకున్నారు. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను మెసలి వదిలివేసింది.


☘ గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ , *"ప్రాత:కాలం , రాత్రి , సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా , స్పృహలో ఉన్నపుడూ , స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే , నీవద్దకు వస్తాను"* అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి , అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.


☘ ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులు ని దర్శించి ఆయనే తన గురువు అని తెలిసికొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి , శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ(వారణాసి) బయలుదేరారు.


☘ ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించుటకై పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలుని ప్రక్కకి తొలగమని చెప్తారు. అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు , ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరుకాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ మనీషా పంచకం చదివారు.


☘ ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీదేవతల స్తుతులూ , అనేక , ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలూ రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి , శివానందలహరి , భజగోవిందం మొదలైనవి.


☘ ఆయన సన్యాసాశ్రమ నియమాలని పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలనీ , ఆమెకు సేవ చేయడం బిడ్డల కర్తవ్యమనీ దానికి ఎలాంటి నియమాలు అడ్డురావనీ లోకానికి చాటిచెప్పారు. తల్లికిచ్చిన మాట కోసం తల్లి అవసాన దశలో *" శ్రీకృష్ణభగవానుని "* లీలలను చూపించి సంతోష పరచాడు !!

ఆనాటి కట్టుబాటులను ఎదిరించి తాను సన్యాసి అయినా కన్నతల్లి అంత్యేష్ఠిని స్వయంగా నిర్వహించాడు !!


☘ ఆయన కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులని ఓడించారు. ఆ తరువాత వాళ్ళు ఆయనకి శిష్యులైనారు. వారిలో కుమారిలభట్టు , మండవమిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు , పద్మపాదుడు , సురేశ్వరుడు , పృధ్వీవరుడు మొదలైన వారు.


☘ వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక , సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ , సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగినారు.


☘ హిందూ ధర్మపరిరక్షణ బలహీనపడుతుండటాన్ని గమనించిన ఆయన , ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ , అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చలో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో శతాధిక గ్రంధాలను రచించిన శంకరులవారు , ఉపనిషత్తులు .. బ్రహ్మసూత్రాలు .. భగవద్గీత .. విష్ణు సహస్రనాలకు భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు. 


☘ గణేశ పంచరత్న స్తోత్రం , భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం , కనకథారా స్తోత్రం , శివానందలహరి , సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.ఈయన 108 గ్రంథాలు రచించారు.


☘ శృంగేరి .. బదరి .. పూరీ .. ద్వారక అనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో పీఠాలను స్థాపించారు. ఆదిశంకరులవారి శిష్యులే అద్భుతమైన రీతిలో మహిమలను ప్రదర్శించారంటే , ఇక శంకరులవారి శక్తులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. శంకరుల చిన్నతనంలో ఆయన అనన్యసామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి. 


☘ ధర్మ సంస్థాపన చేయడానికై ఆయన దేశం నలువైపులా నాలుగు పీఠాలను స్థాపించారు. తూర్పు వైపున ఒడిశా లోని పూరీ లో గోవర్ధన మఠం , దక్షిణం వైపున కర్ణాటక లోని శృంగేరి లో శారదా మఠం , పశ్చిమ దిక్కున గుజరాత్ లోని ద్వారకలో ద్వారకా మఠం , ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో జ్యోతిర్మఠం స్థాపించారు. అవి ఈనాటికీ , ధర్మరక్షణకై పాటుపడుతున్నాయి.


*🌹మఠము-పీఠము🌹*


సన్యాసులు , బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని , మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి , కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి , సుస్థిరంచేయడానికి , వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం , అప్పటి (వందల సంవత్సరాల) నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నది.


*" అధ్వైతసిద్ధాంతాన్ని " ప్రచారం చేశారు* 


దేశంలో నాలుగు వైపుల నాలుగు ప్రధానమైన పీఠాల్ని నెలకొల్పి దేశ సమగ్రత ను ఆధ్యాత్మికతను కాపాడారు !!


*1 .తూర్పున పూరీ క్షేత్రంలో గోవర్ధన పీఠం రుగ్వేదం !!*


*2- దక్షిణాన శృంగేరీ క్షేత్రంలో శారదా పీఠం - యజుర్వేదం!!*


*3 - పశ్చిమాన ద్వారకలో ద్వారక పీఠం - సామ వేదం !!*


*4 - ఉత్తరాన బదరిర క్షేత్రంలో జ్యోతిష్ పీఠం-యజుర్వేదం!!*


నలుగురు శిష్యులను నాలుగు పీఠాలకు అధిపతులను చేసారు.

*'’కంచికామకోటి '’* పీఠాన్ని స్థాపించి తానే స్వయంగా కొన్ని

రోజులు పీఠాన్ని అధిరోహించి హిమాలయాలకు వెల్లి చిన్న వయసులోనే 32 సంవత్సరాలకే తనువు చాలించారు !!

                        *చతుర్మఠాలు*


☘ *ద్వారకా మఠము :-*

ఈ మఠము శంకరులచే , దేశానికి పశ్చిమంగా , మొదటగా స్థాపించబడింది. దీనిని కాళికామఠమనీ , సిద్ధేశ్వరమఠమనీ , పశ్చిమామ్నాయ మఠమనీ అంటారు. 


☘ *గోవర్ధన మఠము:-*

దీనినే పూర్వామ్నాయ మఠము అని అంటారు. ఇది దేశానికి తూర్పున గలపూరీ పట్టణంలో


☘ *శృంగేరీ మఠము :-*

ఇది దక్షిణామ్నాయమఠమని , శారదాపీఠమనీ పిలువబడుతుంది. కర్ణాటక రాష్ట్రములోని శృంగేర(శృంగ లేక ఋష్యశృంగ)లో ఈ మఠము స్థాపించబడింది


☘ *జ్యోతిర్మఠము :-*

దీనిని ఉత్తరామ్నాయమనీ , బదరికాశ్రమమనీ కూడా అంటారు. ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం , పీఠ దేవత నారాయణుడు.


☘ *శంకర మఠము(కంచికామకోటి పీఠము) :-*

సాక్షాత్తూ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలు పైవి. ఇవి కాకుండా , శంకరుడు విదేహ ముక్తి పొందిన కంచి మఠం అయిదవది.


🌳 *ఉన్నది ఒక్కటే పరబ్రహ్మస్వరూపం అనే అధ్వైతం నుప్రభోధించారు !!*  


🌳 *ఇది జ్ఞానమార్గంలో ఉత్కృష్ఠ స్థాయిలో వున్న వారికే ఈ సత్యం అవగతమౌతుంది కనుక సామాన్య జనం కోసం అనేక దేవీ దేవతల పై అష్టకాలు స్తోత్రాలను రచించాడు ! ముందు విగ్రహారాధన చేయమన్నారు !!*


🌳 *ప్రస్థాన త్రయం అంటే భగవద్గీత - బ్రహ్మసూత్రాలు -*

*ఉపనిషత్తలు ! వీటికి భాష్యం (వేదాంత- వ్యాఖ్యానం)రాశారు !*


🌳 *శివుడు - అంబిక - గణపతి - విష్ణువు - సూర్యులను ఆరాధించి తరించాలని వేదోక్త " పంచాయతన "పూజ పద్ధతిని ప్రవేశ పెట్టి విగ్రహారాధనకు ఆలంభనగా నిలిచారు !!*


☘ ఒకరోజు శంకరులు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళుతుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. ఎనిమిది రోజులపాటు చర్చ జరిగిన తరువాత వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది సాక్షాత్తు వ్యాసుడే అని పద్మపాదుడు గ్రహించి ఆ విషయం శంకరులకు తెలిపగా , శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి , తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా , వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమే అని ప్రశంసించాడు. వేదవ్యాసుడు వెళ్ళిపోతుండడం చూసి శంకరులు *'నేను చెయ్యవలసిన పని అయిపొయింది. నాకు ఈ శరీరం నుండి విముక్తిని ప్రసాదించ'మని* వేడుకున్నాడు. అప్పుడు వ్యాసుడు *'లేదు , అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులు అనేకమందిని ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకుని , ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్చానురక్తి అర్థాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్ని ఇవ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకు ఇచ్చిన ఎనిమిది సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరొక 16 ఏళ్ళు ఆయుష్షు లభించుగాక అని దీవించి అంతర్థానం అయ్యాడు. ఆయన జన్మించినప్పుడు ఆయన ఆయుష్షు ఎనిమిది సంవత్సరాలు , తపస్సు వలన సాధించినది ఇంకొక ఎనిమిది సంవత్సరాలు , వ్యాసమహర్షి అనుగ్రహంవల్ల మరొక పదహారు సంవత్సరాలు జీవించి తన 32 వ ఏట ఉత్తరాఖండ్ కాశీలో దేహాన్ని త్యజించారు.

 

*శంకరులు :-*


అలాంటి శంకరులవారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడంకన్నా పుణ్యమేముంటుంది ? అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి. పేద బ్రాహ్మణులకు శక్తి కొద్ది దానధర్మాలు చేయాలి. వారి పిల్లల ఉన్నత విద్యకు ... ఉపనయనాలకు ఆర్ధికపరమైన సహాయ సహకారాలను అందించాలి. ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ , దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి. 


ఆదిశంకరులు అవతరణకు ముందు దేశంలో ఏ పరిస్థితులు

ఉన్నాయో ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు శంకరుడు అవతరించారు. ఇప్పుడు హిందువులందరూ

తమలో నిద్రాణమై ఉన్న ఆదిశంకరులను జాగృతం చేయాలి. ప్రతి హిందువు శంకరుడు అవ్వాలి. ఆయన మనకు స్ఫూర్తి. ఆయన మనలోనే , మనతోనే ఉన్నారు. అందుకే మనము ఈ ధర్మంలో జన్మజన్మలుగా పుడుతూనే ఉన్నాం. సనాతన ధర్మం మన తల్లి. తల్లి రుణం తీర్చుకో వలసిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మాన్ని తెలుసుకొని , ఆచరించి , శక్తిని సంపాదించి , స్ఫూర్తిని పొంది ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి. ధర్మాన్ని కాపాడు. ధర్మాన్ని విస్మరిస్తే జాతి అధోగతి పాలు కాక తప్పదు. కలియుగంలో గురువైన శ్రీ ఆదిశంకరాచార్యులు

రక్ష సదా మనపై ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని అనుసరించు. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక వనంగా మార్చి , అడుగడుగునా భక్తిభావ సుమాలను వికసింపజేసిన అపరశంకరులు. శ్రీ ఆదిశంకరులు

అలాంటి శంకరుల వారిని ఆయన జయంతి సందర్భంగా

స్మరించుకోవడం కన్నా పుణ్యమేముంటుంది ?

అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి.

ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ , దేవాలయాల

అభివృద్ధికి పాటుపడాలి. ఈ విధంగా చేయడం వలన పాపాలు నశించి విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.


*" జయ జయ శంకర హర హర శంకర "*


*" జయ జయ శంకర హర హర శంకర*

🙏🏻🚩🙏🏻🚩🙏🏻🚩🙏🏻

 *"పక్షులు" వాటి గూడు'ని కోల్పోయినప్పుడు, ఆ 'పక్షులు' విలపించడం, మీరెప్పుడైనా చూశారా?? :-*


🕊️ *వర్ష ఋతువు'లో.. ఎప్పుడైతే భయంకరమైన 'వర్షాలు' పడతాయో.. తీవ్రమైన గతి'తో గాలులు వీస్తాయో.. అప్పుడు మీరు, ఎప్పుడో ఒకప్పుడు, చూసే ఉంటారు. ఈ 'పక్షులు' వాటి నివాసాలు కోల్పోపోతుంటాయి. వాటికి ఎంతో నష్టం జరుగుతుంటుంది...*


🕊️ *కానీ, మీరు ఎప్పుడైనా ఆ 'పక్షులు: ఆ సమయంలో విలపిస్తున్నట్టుగా.. చూశారా?? ఎప్పుడూ లేదు కదా, ఎప్పుడైతే వర్షం ఆగిపోతుందో.. ఆ 'పక్షులు' మళ్లీ గడ్డిపరకలను జోడించి, వాటితో గూడు'ని, తయారు చేసుకుంటాయి. వాటి 'ప్రపంచం' ఇంతకుముందు ఎలా ఉండేదో, మళ్లీ అలానే తయారు చేసుకుంటాయి. కానీ ఎందుకు??...*


🕊️ *ఎందుకంటే, ఈ చక్రవాక్య 'కాలం' వలన, ఆ పక్షుల'కు ఎలాంటి 'సంబంధం' లేనే లేదు. ఆ 'పక్షలైతే' కేవలం, ఏం చేస్తాయి అంటే, వాటి'చేతిలో ఉన్నది కేవలం "ప్రేమ" మాత్రమే, ఇక ఇదే సంతోషకరమైన 'జీవితాని'కి మూలమంత్రం...*


🕊️ *ఏదైతే మీ చేతిలో ఉండదో, దానికోసం విలపించడం వల్ల, ఎలాంటి లాభము ఉండదు. మీ 'ధ్యాస', కేవలం మీ వల్ల జరిగే దానిపై మాత్రమే, 'కేంద్రీకృతం' చేయండి...*


🕊️ *ఏదైతే జరిగిపోయిందో.. చెప్పాలంటే, మీరు దాన్ని మార్చలేరు. కానీ, దేన్నైతే మీరు మార్చగలరో.. మీరు దానిపై మాత్రమే, దృష్టి'ని, 'కేంద్రీకృతం' చేయండి. ఈ జీవితం'లో.. మీరు ధైర్యం'గా ఉండటం నేర్చుకోండి. ఇక ఆ తరువాత, అంతా మంచే జరుగుతుంది...*🤝


సేకరణ. మానస సరోవరం 👏👏👏

 *జన్మపరంపర చక్రం నుండి విముక్తి*

                ➖➖➖✍️


*సకల సౌకర్యాలున్న అద్దె ఇంటిని వదిలిపెట్టాల్సి వస్తే దానిపై పెంచుకున్న వ్యామోహం వల్ల ప్రాణం విలవిల్లాడుతుంది.*


*శరీరం కూడా అలాంటిదే! కానీ, ఎప్పటికైనా దాన్ని వదిలిపెట్టక తప్పదు. అందుకే శరీరంపై ఉన్న మమకారాన్ని జయించాలి.* 


*ఎందుకంటే, అదే మానవునికి శోకదాయకం, బంధకారణం అవుతున్నది. ఏ శరీరమైనా ఎప్పటికైనా పడిపోవాల్సిందే!*


*ఈ యుగంలో మానవుల జీవితకాలం సుమారు వందేండ్లు అంటున్నాం. కానీ, పూర్వయుగంలో ఆయుర్దాయం వేల ఏండ్లుగా ఉండేది. ఎన్నో శతాబ్దాలు జీవించేవాళ్లు. ఎన్నేండ్లు బతికినా చివరికి దేహం వదలాల్సిందే!*


*అలాంటప్పుడు దానిపట్ల ఇంత అభిమానం ఎందుకు? వేల ఏండ్లు రాజ్యపాలన చేసిన శ్రీరామచంద్రుడి వంటి అవతార పురుషులు కూడా, శరీరాలు వదిలిపెట్టిన వారే! దాంతో పోలిస్తే మనం శరీరాలు వదిలిపెట్టడం అసలు విషయమే కాదు.* 


*కానీ, మనిషి మాత్రం జరామరణాలు జయించాలని, కలకాలం సశరీరంగా ఉండాలని ఆశపడుతూ ఉండటం హాస్యాస్పదం.*


*ఆప్తులు ఎవరైనా దూరమైనప్పుడు, మనసులో వారి స్మృతులు తిరుగుతూ తెగ హైరానా కలిగిస్తాయి. ఆ వ్యక్తులు కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, మాట్లాడినప్పుడు జరిగిన సంఘటనలన్నీ గుర్తుకువచ్చి బాధిస్తుంటాయి.*


*నాలుగు రోజులు పోతే మనమూ పోతామన్న యథార్థం మరిచి వగస్తూనే ఉంటాం. ‘మనం ఉన్నది వీటన్నిటినీ గుర్తు చేసుకోవడానికేనా!’ అని ఎవరూ ప్రశ్నించుకోవడం లేదు.*


*నిజానికి పోయినవారు మనసును బాధించడం లేదు. వారి తాలూకు స్మృతులే మనల్ని బాధిస్తాయి. ఆ విషయాన్ని గుర్తించలేకున్నాం. స్మృతులే బాధిస్తున్నాయని రూఢీ అవుతున్నది కాబట్టి, వాటిని తొలగిస్తే శోకం దూరం అవుతుందని స్ఫురించడం లేదు.*


*అసలు ఆప్తవియోగ స్మృతులు మనిషిని బాధించడానికి చాలా కారణాలుంటాయి. పోయిన వ్యక్తి రూపరేఖా విలాసాలు, వారితో మనకున్న అనుబంధం ఇవన్నీ చెప్పుకోవచ్చు.*


*కానీ, మనిషి రూపం అతని శరీరం పడిపోయాక కాలిబూడిదయిపోతుంది. వారితో ఉన్న అనుబంధాన్ని తలచుకునే క్రమంలోనూ ఆ పోయిన వ్యక్తుల శరీరాలు మనోఫలకంపై కదలాడుతుంటాయి.*


✅*ఈ శరీరాల స్మరణ నిత్యం జరుగుతూ ఉండటం వల్ల మళ్లీ మళ్లీ శరీరాలు ధరించాల్సి వస్తున్నది. అంటే జన్మ పరంపరలు కొనసాగడానికి ఇదీ ఒక కారణం.*


*ఎప్పుడు రాలిపోతాయో తెలియని శరీరాల గురించి ఇంత వెర్రి అభిమానం ఎందుకు? దుఃఖం కలుగుతున్నప్పటికీ ఎందుకు తొలగించుకోవడం లేదు? అని ప్రశ్నించుకోవాలి.*


*శరీరాలు పతనం చెందకుండా ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది కదా, అంటారా! అందుకోసం మనిషి శాశ్వతంగా జీవించే ఉపాయం కావాలి. భూమిపై శాశ్వతంగా ఉండిపోవాలన్న తపన అనాది నుంచి ఉన్నదే! అందుకే కదా, హిరణ్యకశిపుడు, రావణుడు తదితరులు ఘోర తపస్సులు చేసి వరాలు పొందింది.* 


*అయినా, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు అన్నది సృష్టి నియమం. దాన్ని అనుసరించి ఎన్ని వరాలు పొందినా, ఇంకెన్ని మాయోపాయాలు చేసినా అంతిమంగా వారి శరీరాలు కూలిపోయాయి. ఏతావాతా శరీరాలను శాశ్వతంగా నిలబెట్టాలన్న అభిప్రాయం తప్పని తేలుతున్నది.*


*ఇక ఇప్పుడు మిగిలింది స్మృతులు. అవి విజృంభించే మనసు. వీటిని సరిదిద్దుకోవలసింది మనమే. అదెలాగంటే, మనసులోంచి మానవ శరీరాలను, తత్సంబంధ జ్ఞాపకాలను నిర్దాక్షిణ్యంగా తరిమికొట్టాలి.*


*ఇది ఒకే పద్ధతి వల్ల మాత్రమే సాధ్యం. భగవద్రూపాలు బంధ కారణాలు కావు. విముక్తి హేతువులు. కాబట్టి, దివ్యమైన భగవంతుడి రూపాలతో, అమూల్యమైన స్మృతులతో, సత్యమైన అనుభూతులతో రేయింబవళ్లూ మనసును నింపగలగాలి. *


*అప్పుడు నిరతిశయానందం మనిషికి సొంతం అవుతుందనడంలో సందేహం లేదు. భగవంతుడి రూపాన్ని, భావనను మనసులో సదా నిలుపుకోగలిగితే జీవితానికి సార్థకత కలుగుతుంది.*


*అపుడు ఈ శరీరం ఎప్పుడు పడిపోయినా, మళ్లీ శరీరాన్ని ధరించే జన్మ పరంపర చక్రం నుంచి విముక్తి లభిస్తుంది.*✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

Gg