13, మే 2022, శుక్రవారం
12, మే 2022, గురువారం
11, మే 2022, బుధవారం
10, మే 2022, మంగళవారం
8, మే 2022, ఆదివారం
7, మే 2022, శనివారం
5, మే 2022, గురువారం
రేపటి రోజు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల యొక్క ఆవిర్భావ దినం. ఇది సనాతన ధర్మం అంతటికీ పండుగరోజు.
ఎంతవరకూ దేహమే నేను అనే భావం ఉంటుందో అంతవరకూ వైదికమైన సత్కర్మలు ఆచరించాలి.
షణ్మతాలూ ఈ మూడు సిద్ధాంతాలతో ఉంటాయి.
ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతములు X షణ్మతములు = హిందూ ధర్మం యొక్క స్వరూపం.
అద్వైతం అనే ఒకానొక జ్ఞానం భూమికగా కలిగి ఉన్నట్లయితే పరస్పర వైరములు లేకుండా ఉంటాయి. అందుకే ఆదిశంకర భగవత్పాదుల వారు అద్వైతం ప్రతిష్ఠాపన చేస్తూ “ఉన్నది ఒక్కటే పరమాత్మ తత్త్వము. జీవుడికి కూడా దేహాత్మ భ్రాంతి ఉన్నంతవరకే భేదం కానీ అది తొలగించి చూస్తే సత్య దృష్టితో అద్వైతమే” అని చెప్పారు.
వ్యవహారంలో అద్వైతం కుదరదు, ద్వైతమే ఉంటుంది. పరమార్థంలోనే అద్వైతం. పారమార్థిక దృష్టి కలిగి వ్యవహార జీవనంలో ఉన్నప్పుడు అద్వైత స్పృహలోనే ద్వైత జగత్తులో ఉంటాం. దీనివల్ల సమాజంలో ఒక శాంతి ఏర్పడుతుంది.
సిద్ధాంతాలు అర్థం అయినా అవకపోయినా శంకర సిద్ధాంతంలో ఉన్న వారికి ఎవరి ఇష్టదేవతలు వారికి ఉన్నా ఇతర దేవతలను ద్వేషించరు. అది ఒక్కటి చాలు ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచే పద్ధతి.
వైష్ణవంలోను, శైవంలోనూ మహాత్ములు, ఉద్దండులూ ఉద్భవించారు. గొప్పగొప్ప భక్తులు ఉన్నారు. వారు ముక్తజీవులే. కానీ వారి అనుయాయులం అని చెప్పుకొనే వారిలో ప్రస్తుతం ఉన్నవారు శివద్వేషం వైష్ణవంగాను, విష్ణుద్వేషం శైవంగాను, చలామణి అవుతోంది. వీరికి ఇతర మతముల పట్ల విపరీతమైన ద్వేషం.
చాలామందికి శంకరాచార్య అంటే శైవుడని, రామానుజాచార్య అంటే వైష్ణవుడనీ, ఒకానొక భ్రమ బాగా ఉంది. రామానుజులు కేవల వైష్ణవ మతస్థులు అనడంలో ఏమీ సందేహం లేదు. ఆయన ఇతర దేవతలను ప్రశంసించరు. మీదు మిక్కిలి వారి అనుయాయులు శివాదులను ద్వేషించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇతర దేవతలు అంటే వారికి గిట్టదు. అవమానంగానే చూస్తారు. తపనిసరియై నోరుమూసుకున్నప్పటికీ మనస్సు నిండా కించపరచే భావమే వారికి ఉంటుంది.
శంకరాచార్య శైవులు కాదు. ఆయన శివాంశ సంభూతులు అని శంకర విజయాలు చెప్పాయే తప్ప ఆయన శైవుడు కాదు.
వైదిక శైవం గురించి చెప్పాలంటే శ్రీకంఠాచార్యులు, వీరశైవం బసవేశ్వరులు మొదలైన వాళ్ళు ఇచ్చారు.
శైవం వేరు, వైష్ణవం వేరు, శాక్తేయులూ ఉన్నారు. వారందరూ ఆగమ మతాలు. కానీ శంకరాచార్యులు వీటి వేటికీ చెందరు. ఆయనకి శివుడు, విష్ణువు, భేదం లేదు. ఉన్నది ఒక్కటే పరమాత్మ. ఆయన నిర్గుణుడు, నిరాకారుడు. కానీ భక్తులు ఉపాసనా సౌలభ్యం కోసం ఆయన అనేక రూపాలు స్వీకరిస్తాడు. విష్ణువు, శివుడు ఒకే పరమాత్మ నామములే. ఆ పరమాత్మ ప్రతి జీవుడిలో అంతర్యామియే. తత్త్వతః తెలుసుకోగలిగితే జీవుడికీ పరమాత్మకీ భేదం లేదు. ఇది శంకర సిద్ధాంతం.
శంకరులు ఎప్పుడూ శైవం కాదు, ఇది ముందు తెలుసుకోవాలి.
ఈ వైష్ణవం అనుకొనే ఇతర దేవతా ద్వేషం కలిగినటువంటి వారు శంకరులు శైవులు అని ఒక ముద్ర వేస్తున్నారు. శంకరుల ధర్మంలో శైవం, వైష్ణవం అన్నీ కలిసి ఉంటాయి. షణ్మత ప్రతిష్ఠాపనాచార్య అనే పేరు కూడా ఉన్నది.
ప్రస్తుతం సనాతనధర్మం కలిసికట్టుగా ఉండాలంటే ఎవరి సంప్రదాయం వారు పాటించాలి. ఇతర సంప్రదాయాలను గౌరవించాలి. ఇది సత్సంప్రదాయం. చాలా అవసరం.
వైష్ణవులు వైష్ణవంలో ఉన్న వారికి వైష్ణవ ధర్మాలను బోధించడం చేయాలి. ఇతరులకి విష్ణుభక్తిని బోధించాలి. అలాగే శైవులు కూడా శైవసంప్రదాయంలో ఉన్నవారికి శైవ దీక్షలు ఇప్పించవచ్చు. ఇతరులకు శివభక్తి బోధించవచ్చు. కానీ అందరు దేవతలను ఆరాధించుకొనే సంప్రదాయంలో ఉన్నవారిని బలవంతంగా మార్చి, వారికి శివుడి ఆలయాలకు వెళ్ళవద్దు, శివపూజలు చేయవద్దు, శివుడు అంటే అష్టదిక్పాలకులలో ఒకడు, ఏకాదశ రుద్రులలో ఒకడు అంటూ కించపరచి మాట్లాడడం జరుగుతోంది. ఇది చాలా బాధాకరమైన విషయం.
ఇతరులు మన దేవతలను అవమానిస్తూ మతమార్పిడులు చేయడం ఎలాంటిదో మన మతంలో ఉపమార్పిడులు కూడా అటువంటివే.
రాజకీయ ప్రాపకాలు, ప్రభుత్వ అండదండలు దగ్గర పెట్టుకొని ఇలాంటి దాష్టీకాలు చేస్తూ సనాతన ధర్మంలో చీలికలు ఎవరైతే తీసుకువస్తున్నారో వాళ్ళు జగద్గురువులు అనడానికి లేదు. వాళ్ళ శాఖకి వాళ్ళు గురువులు అంతే.
సనాతన ధర్మం వేదంలోనుంచి వచ్చిన ఆరుమతాలనూ చూపిస్తూ ఎవరి దేవతలను వారు ఆరాధించుకోండి, ఇతరులను గౌరవించండి.
హిందూధర్మం మొత్తానికి ఒక గురువును చెప్పుకోవాలంటే ఆ గురువు ఆదిశంకర భగవత్పాదులు మాత్రమే. ఆయన వచ్చిన తరువాతనే అవైదిక మతాల ధాటికి చెదిరిపోయినటువంటి శైవవైష్ణవాదులు తిరిగి ఊపిరి పోసుకున్నాయి. అందుకే ఆయనని “షణ్మతప్రతిష్ఠాపనాచార్య’ అన్నారు.
సనాతన హిందూ ధర్మానికి సమగ్రమైనటువంటి జగద్గురువులుగా ఆదిశంకరులను గౌరవిస్తూ వారి సంప్రదాయ గురువులను గౌరవించుకోవచ్చు. తప్పులేదు.
అన్ని రకాల సంప్రదాయాలు ఆ సంప్రదాయంలోని గురువుల వల్లనే పుష్టి పొందాయి. ఈ సంప్రదాయాలన్నింటినీ గౌరవించడం అనే సంప్రదాయం మాత్రం జగద్గురువులు ఆదిశంకర పరంపరలో ఉంది నేటికి కూడా. శంకర పీఠములన్నింటిలోని వారూ ఇటువంటి సామరస్య ధోరణితో ఉన్నటువంటి వారే. పీఠ పరిపాలిత దేవాలయాలలోనూ హైందవ దేవతలందరూ ఆరాధింపబడుతూ ఉన్నారు. నారాయణ స్మరణ, చంద్రమౌళీశ్వరారాధన, శ్రీచక్రార్చన చేస్తారు. సనాతనధర్మం యొక్క స్వరూపం ఇది.
ప్రతి సంప్రదాయం వాళ్ళూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం వారి సంప్రదాయం వదులుకోకుండా ఇతర సంప్రదాయాలను గౌరవించడం నేర్చుకోవాలి. విష్ణువే గొప్ప శివుడు కాదు అని వాళ్ళ గ్రంథాలను భుజాన మోసుకొని ఎలా తిరుగుతున్నారో, శివుడు తప్ప ఇంకెవరూ గొప్ప కాదు అని చెప్తూ గ్రంథములు మోసుకు తిరగడానికి వాళ్ళూ సిద్ధంగా ఉన్నారు. ఏ నూతిలో మండూకానికి ఆ నూతి లోతు తెలిసినట్లు ఏ సంప్రదాయజ్ఞుడికి ఆ సంప్రదాయపు లోతు తెలుస్తుంది. తమకు తెలియని సంప్రదాయాల గురించి అవహేళనగా, కించపరచి మాట్లాడరాదు. సందర్భం వస్తే అది మా సబ్జెక్ట్ కాదు అని నమస్కారం చేయడం చాలా మంచిది.
సనాతనధర్మం పరస్పర ద్వేషాలు, చీలికల జోలికి వెళ్ళకుండా సమన్వయ ధోరణిలో వెళ్ళాలి అని ఒక సంకల్పం తీసుకోవాలి. ఇక ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతాల గొడవ పండితులు ఎలాగూ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. సామాన్యులకి అవి అవసరం లేదు. ధర్మము, భక్తి – ఈ రెండూ చాలా ప్రధానం.
మనది మనం పాటిద్దాం, ఇతరులను గౌరవిద్దాం. ఈ సంప్రదాయాన్నిమనకు బోధించిన జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల పాదపద్మాలకు నమస్కరిద్దాం.
_*🚩ఆదిశంకరాచార్య జయంతి🚩*_
*జగద్గురు ఆదిశంకరాచార్యులు*
హిందూ మత పరిరక్షణ కొరకు అవతరించిన సరళ సిద్ధాంతవేత్త ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరులు , శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు , మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం.
*శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్ !*
*నమామి భగవత్పాదం శంకరం లోకశంకరమ్ !!*
*ఆది శంకర జయంతి*
ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు , మతాలూ పుట్టుకొచ్చి , ప్రజలకి సనాతన ధర్మం పట్ల , భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. శ్రౌత , స్మార్త క్రియలను సుప్రతిష్టితం చేసి , వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం
*దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే !*
*స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః !!*
దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (శివరహస్యము నుండి)
*కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః !*
*శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా !!*
శ్రౌత , స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి , వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుండి)
జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం) శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు , శని , గురుడు , కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ , శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ , శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి , ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందినారు. పార్వతీ దేవి , సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో , ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం చెబుతోంది. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నప్పటికీ , కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారం , ఆయన జీవన కాలం క్రీ.పూ.509 – క్రీ.పూ. 477 అని తెలియవస్తోంది.
ఆయన తన రెండవ ఏటనే రాయడం , చదవడం గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేసారు. ఏడవ సంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేసారు. కారణజన్ములైన శంకరాచార్యులవారు , సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదా చార్యులవారి చెంత శాస్త్రాధ్యాయనం చేశారు.
☘ ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను త్రావించి తన కరుణాకటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది.
☘ ఇంకొకసారి ఆయన వేదాభ్యసన సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా , ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరి కాయను ఆయనకు ఇచ్చివేసింది. ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ. *“ కనకధారా స్తవం ”* ఆశువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది.
☘ శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజూ స్నానానికై వెళ్ళలేకపోవడం గమనించి
అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి , నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహం మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. తన తపశ్శక్తి తో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేటట్లు చేసారు.
☘ ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది. సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది. ఆయన తల్లిని తనను సన్యసించడానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుందని , అనుమతినివ్వమనీ ప్రార్థించారు. తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది. ఈ సంసారబంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నయనీ , ఆ బంధాలనుండి తనను తప్పించమనీ ఆయన తల్లిని వేడుకున్నారు. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను మెసలి వదిలివేసింది.
☘ గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ , *"ప్రాత:కాలం , రాత్రి , సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా , స్పృహలో ఉన్నపుడూ , స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే , నీవద్దకు వస్తాను"* అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి , అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.
☘ ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులు ని దర్శించి ఆయనే తన గురువు అని తెలిసికొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి , శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ(వారణాసి) బయలుదేరారు.
☘ ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించుటకై పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలుని ప్రక్కకి తొలగమని చెప్తారు. అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు , ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరుకాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ మనీషా పంచకం చదివారు.
☘ ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీదేవతల స్తుతులూ , అనేక , ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలూ రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి , శివానందలహరి , భజగోవిందం మొదలైనవి.
☘ ఆయన సన్యాసాశ్రమ నియమాలని పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలనీ , ఆమెకు సేవ చేయడం బిడ్డల కర్తవ్యమనీ దానికి ఎలాంటి నియమాలు అడ్డురావనీ లోకానికి చాటిచెప్పారు. తల్లికిచ్చిన మాట కోసం తల్లి అవసాన దశలో *" శ్రీకృష్ణభగవానుని "* లీలలను చూపించి సంతోష పరచాడు !!
ఆనాటి కట్టుబాటులను ఎదిరించి తాను సన్యాసి అయినా కన్నతల్లి అంత్యేష్ఠిని స్వయంగా నిర్వహించాడు !!
☘ ఆయన కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులని ఓడించారు. ఆ తరువాత వాళ్ళు ఆయనకి శిష్యులైనారు. వారిలో కుమారిలభట్టు , మండవమిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు , పద్మపాదుడు , సురేశ్వరుడు , పృధ్వీవరుడు మొదలైన వారు.
☘ వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక , సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ , సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగినారు.
☘ హిందూ ధర్మపరిరక్షణ బలహీనపడుతుండటాన్ని గమనించిన ఆయన , ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ , అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చలో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో శతాధిక గ్రంధాలను రచించిన శంకరులవారు , ఉపనిషత్తులు .. బ్రహ్మసూత్రాలు .. భగవద్గీత .. విష్ణు సహస్రనాలకు భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు.
☘ గణేశ పంచరత్న స్తోత్రం , భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం , కనకథారా స్తోత్రం , శివానందలహరి , సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.ఈయన 108 గ్రంథాలు రచించారు.
☘ శృంగేరి .. బదరి .. పూరీ .. ద్వారక అనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో పీఠాలను స్థాపించారు. ఆదిశంకరులవారి శిష్యులే అద్భుతమైన రీతిలో మహిమలను ప్రదర్శించారంటే , ఇక శంకరులవారి శక్తులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. శంకరుల చిన్నతనంలో ఆయన అనన్యసామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి.
☘ ధర్మ సంస్థాపన చేయడానికై ఆయన దేశం నలువైపులా నాలుగు పీఠాలను స్థాపించారు. తూర్పు వైపున ఒడిశా లోని పూరీ లో గోవర్ధన మఠం , దక్షిణం వైపున కర్ణాటక లోని శృంగేరి లో శారదా మఠం , పశ్చిమ దిక్కున గుజరాత్ లోని ద్వారకలో ద్వారకా మఠం , ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో జ్యోతిర్మఠం స్థాపించారు. అవి ఈనాటికీ , ధర్మరక్షణకై పాటుపడుతున్నాయి.
*🌹మఠము-పీఠము🌹*
సన్యాసులు , బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని , మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి , కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి , సుస్థిరంచేయడానికి , వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం , అప్పటి (వందల సంవత్సరాల) నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నది.
*" అధ్వైతసిద్ధాంతాన్ని " ప్రచారం చేశారు*
దేశంలో నాలుగు వైపుల నాలుగు ప్రధానమైన పీఠాల్ని నెలకొల్పి దేశ సమగ్రత ను ఆధ్యాత్మికతను కాపాడారు !!
*1 .తూర్పున పూరీ క్షేత్రంలో గోవర్ధన పీఠం రుగ్వేదం !!*
*2- దక్షిణాన శృంగేరీ క్షేత్రంలో శారదా పీఠం - యజుర్వేదం!!*
*3 - పశ్చిమాన ద్వారకలో ద్వారక పీఠం - సామ వేదం !!*
*4 - ఉత్తరాన బదరిర క్షేత్రంలో జ్యోతిష్ పీఠం-యజుర్వేదం!!*
నలుగురు శిష్యులను నాలుగు పీఠాలకు అధిపతులను చేసారు.
*'’కంచికామకోటి '’* పీఠాన్ని స్థాపించి తానే స్వయంగా కొన్ని
రోజులు పీఠాన్ని అధిరోహించి హిమాలయాలకు వెల్లి చిన్న వయసులోనే 32 సంవత్సరాలకే తనువు చాలించారు !!
*చతుర్మఠాలు*
☘ *ద్వారకా మఠము :-*
ఈ మఠము శంకరులచే , దేశానికి పశ్చిమంగా , మొదటగా స్థాపించబడింది. దీనిని కాళికామఠమనీ , సిద్ధేశ్వరమఠమనీ , పశ్చిమామ్నాయ మఠమనీ అంటారు.
☘ *గోవర్ధన మఠము:-*
దీనినే పూర్వామ్నాయ మఠము అని అంటారు. ఇది దేశానికి తూర్పున గలపూరీ పట్టణంలో
☘ *శృంగేరీ మఠము :-*
ఇది దక్షిణామ్నాయమఠమని , శారదాపీఠమనీ పిలువబడుతుంది. కర్ణాటక రాష్ట్రములోని శృంగేర(శృంగ లేక ఋష్యశృంగ)లో ఈ మఠము స్థాపించబడింది
☘ *జ్యోతిర్మఠము :-*
దీనిని ఉత్తరామ్నాయమనీ , బదరికాశ్రమమనీ కూడా అంటారు. ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం , పీఠ దేవత నారాయణుడు.
☘ *శంకర మఠము(కంచికామకోటి పీఠము) :-*
సాక్షాత్తూ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలు పైవి. ఇవి కాకుండా , శంకరుడు విదేహ ముక్తి పొందిన కంచి మఠం అయిదవది.
🌳 *ఉన్నది ఒక్కటే పరబ్రహ్మస్వరూపం అనే అధ్వైతం నుప్రభోధించారు !!*
🌳 *ఇది జ్ఞానమార్గంలో ఉత్కృష్ఠ స్థాయిలో వున్న వారికే ఈ సత్యం అవగతమౌతుంది కనుక సామాన్య జనం కోసం అనేక దేవీ దేవతల పై అష్టకాలు స్తోత్రాలను రచించాడు ! ముందు విగ్రహారాధన చేయమన్నారు !!*
🌳 *ప్రస్థాన త్రయం అంటే భగవద్గీత - బ్రహ్మసూత్రాలు -*
*ఉపనిషత్తలు ! వీటికి భాష్యం (వేదాంత- వ్యాఖ్యానం)రాశారు !*
🌳 *శివుడు - అంబిక - గణపతి - విష్ణువు - సూర్యులను ఆరాధించి తరించాలని వేదోక్త " పంచాయతన "పూజ పద్ధతిని ప్రవేశ పెట్టి విగ్రహారాధనకు ఆలంభనగా నిలిచారు !!*
☘ ఒకరోజు శంకరులు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళుతుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. ఎనిమిది రోజులపాటు చర్చ జరిగిన తరువాత వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది సాక్షాత్తు వ్యాసుడే అని పద్మపాదుడు గ్రహించి ఆ విషయం శంకరులకు తెలిపగా , శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి , తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా , వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమే అని ప్రశంసించాడు. వేదవ్యాసుడు వెళ్ళిపోతుండడం చూసి శంకరులు *'నేను చెయ్యవలసిన పని అయిపొయింది. నాకు ఈ శరీరం నుండి విముక్తిని ప్రసాదించ'మని* వేడుకున్నాడు. అప్పుడు వ్యాసుడు *'లేదు , అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులు అనేకమందిని ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకుని , ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్చానురక్తి అర్థాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్ని ఇవ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకు ఇచ్చిన ఎనిమిది సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరొక 16 ఏళ్ళు ఆయుష్షు లభించుగాక అని దీవించి అంతర్థానం అయ్యాడు. ఆయన జన్మించినప్పుడు ఆయన ఆయుష్షు ఎనిమిది సంవత్సరాలు , తపస్సు వలన సాధించినది ఇంకొక ఎనిమిది సంవత్సరాలు , వ్యాసమహర్షి అనుగ్రహంవల్ల మరొక పదహారు సంవత్సరాలు జీవించి తన 32 వ ఏట ఉత్తరాఖండ్ కాశీలో దేహాన్ని త్యజించారు.
*శంకరులు :-*
అలాంటి శంకరులవారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడంకన్నా పుణ్యమేముంటుంది ? అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి. పేద బ్రాహ్మణులకు శక్తి కొద్ది దానధర్మాలు చేయాలి. వారి పిల్లల ఉన్నత విద్యకు ... ఉపనయనాలకు ఆర్ధికపరమైన సహాయ సహకారాలను అందించాలి. ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ , దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి.
ఆదిశంకరులు అవతరణకు ముందు దేశంలో ఏ పరిస్థితులు
ఉన్నాయో ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు శంకరుడు అవతరించారు. ఇప్పుడు హిందువులందరూ
తమలో నిద్రాణమై ఉన్న ఆదిశంకరులను జాగృతం చేయాలి. ప్రతి హిందువు శంకరుడు అవ్వాలి. ఆయన మనకు స్ఫూర్తి. ఆయన మనలోనే , మనతోనే ఉన్నారు. అందుకే మనము ఈ ధర్మంలో జన్మజన్మలుగా పుడుతూనే ఉన్నాం. సనాతన ధర్మం మన తల్లి. తల్లి రుణం తీర్చుకో వలసిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మాన్ని తెలుసుకొని , ఆచరించి , శక్తిని సంపాదించి , స్ఫూర్తిని పొంది ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి. ధర్మాన్ని కాపాడు. ధర్మాన్ని విస్మరిస్తే జాతి అధోగతి పాలు కాక తప్పదు. కలియుగంలో గురువైన శ్రీ ఆదిశంకరాచార్యులు
రక్ష సదా మనపై ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని అనుసరించు. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక వనంగా మార్చి , అడుగడుగునా భక్తిభావ సుమాలను వికసింపజేసిన అపరశంకరులు. శ్రీ ఆదిశంకరులు
అలాంటి శంకరుల వారిని ఆయన జయంతి సందర్భంగా
స్మరించుకోవడం కన్నా పుణ్యమేముంటుంది ?
అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి.
ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ , దేవాలయాల
అభివృద్ధికి పాటుపడాలి. ఈ విధంగా చేయడం వలన పాపాలు నశించి విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.
*" జయ జయ శంకర హర హర శంకర "*
*" జయ జయ శంకర హర హర శంకర*
🙏🏻🚩🙏🏻🚩🙏🏻🚩🙏🏻
*"పక్షులు" వాటి గూడు'ని కోల్పోయినప్పుడు, ఆ 'పక్షులు' విలపించడం, మీరెప్పుడైనా చూశారా?? :-*
🕊️ *వర్ష ఋతువు'లో.. ఎప్పుడైతే భయంకరమైన 'వర్షాలు' పడతాయో.. తీవ్రమైన గతి'తో గాలులు వీస్తాయో.. అప్పుడు మీరు, ఎప్పుడో ఒకప్పుడు, చూసే ఉంటారు. ఈ 'పక్షులు' వాటి నివాసాలు కోల్పోపోతుంటాయి. వాటికి ఎంతో నష్టం జరుగుతుంటుంది...*
🕊️ *కానీ, మీరు ఎప్పుడైనా ఆ 'పక్షులు: ఆ సమయంలో విలపిస్తున్నట్టుగా.. చూశారా?? ఎప్పుడూ లేదు కదా, ఎప్పుడైతే వర్షం ఆగిపోతుందో.. ఆ 'పక్షులు' మళ్లీ గడ్డిపరకలను జోడించి, వాటితో గూడు'ని, తయారు చేసుకుంటాయి. వాటి 'ప్రపంచం' ఇంతకుముందు ఎలా ఉండేదో, మళ్లీ అలానే తయారు చేసుకుంటాయి. కానీ ఎందుకు??...*
🕊️ *ఎందుకంటే, ఈ చక్రవాక్య 'కాలం' వలన, ఆ పక్షుల'కు ఎలాంటి 'సంబంధం' లేనే లేదు. ఆ 'పక్షలైతే' కేవలం, ఏం చేస్తాయి అంటే, వాటి'చేతిలో ఉన్నది కేవలం "ప్రేమ" మాత్రమే, ఇక ఇదే సంతోషకరమైన 'జీవితాని'కి మూలమంత్రం...*
🕊️ *ఏదైతే మీ చేతిలో ఉండదో, దానికోసం విలపించడం వల్ల, ఎలాంటి లాభము ఉండదు. మీ 'ధ్యాస', కేవలం మీ వల్ల జరిగే దానిపై మాత్రమే, 'కేంద్రీకృతం' చేయండి...*
🕊️ *ఏదైతే జరిగిపోయిందో.. చెప్పాలంటే, మీరు దాన్ని మార్చలేరు. కానీ, దేన్నైతే మీరు మార్చగలరో.. మీరు దానిపై మాత్రమే, దృష్టి'ని, 'కేంద్రీకృతం' చేయండి. ఈ జీవితం'లో.. మీరు ధైర్యం'గా ఉండటం నేర్చుకోండి. ఇక ఆ తరువాత, అంతా మంచే జరుగుతుంది...*🤝
సేకరణ. మానస సరోవరం 👏👏👏
*జన్మపరంపర చక్రం నుండి విముక్తి*
➖➖➖✍️
*సకల సౌకర్యాలున్న అద్దె ఇంటిని వదిలిపెట్టాల్సి వస్తే దానిపై పెంచుకున్న వ్యామోహం వల్ల ప్రాణం విలవిల్లాడుతుంది.*
*శరీరం కూడా అలాంటిదే! కానీ, ఎప్పటికైనా దాన్ని వదిలిపెట్టక తప్పదు. అందుకే శరీరంపై ఉన్న మమకారాన్ని జయించాలి.*
*ఎందుకంటే, అదే మానవునికి శోకదాయకం, బంధకారణం అవుతున్నది. ఏ శరీరమైనా ఎప్పటికైనా పడిపోవాల్సిందే!*
*ఈ యుగంలో మానవుల జీవితకాలం సుమారు వందేండ్లు అంటున్నాం. కానీ, పూర్వయుగంలో ఆయుర్దాయం వేల ఏండ్లుగా ఉండేది. ఎన్నో శతాబ్దాలు జీవించేవాళ్లు. ఎన్నేండ్లు బతికినా చివరికి దేహం వదలాల్సిందే!*
*అలాంటప్పుడు దానిపట్ల ఇంత అభిమానం ఎందుకు? వేల ఏండ్లు రాజ్యపాలన చేసిన శ్రీరామచంద్రుడి వంటి అవతార పురుషులు కూడా, శరీరాలు వదిలిపెట్టిన వారే! దాంతో పోలిస్తే మనం శరీరాలు వదిలిపెట్టడం అసలు విషయమే కాదు.*
*కానీ, మనిషి మాత్రం జరామరణాలు జయించాలని, కలకాలం సశరీరంగా ఉండాలని ఆశపడుతూ ఉండటం హాస్యాస్పదం.*
*ఆప్తులు ఎవరైనా దూరమైనప్పుడు, మనసులో వారి స్మృతులు తిరుగుతూ తెగ హైరానా కలిగిస్తాయి. ఆ వ్యక్తులు కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, మాట్లాడినప్పుడు జరిగిన సంఘటనలన్నీ గుర్తుకువచ్చి బాధిస్తుంటాయి.*
*నాలుగు రోజులు పోతే మనమూ పోతామన్న యథార్థం మరిచి వగస్తూనే ఉంటాం. ‘మనం ఉన్నది వీటన్నిటినీ గుర్తు చేసుకోవడానికేనా!’ అని ఎవరూ ప్రశ్నించుకోవడం లేదు.*
*నిజానికి పోయినవారు మనసును బాధించడం లేదు. వారి తాలూకు స్మృతులే మనల్ని బాధిస్తాయి. ఆ విషయాన్ని గుర్తించలేకున్నాం. స్మృతులే బాధిస్తున్నాయని రూఢీ అవుతున్నది కాబట్టి, వాటిని తొలగిస్తే శోకం దూరం అవుతుందని స్ఫురించడం లేదు.*
*అసలు ఆప్తవియోగ స్మృతులు మనిషిని బాధించడానికి చాలా కారణాలుంటాయి. పోయిన వ్యక్తి రూపరేఖా విలాసాలు, వారితో మనకున్న అనుబంధం ఇవన్నీ చెప్పుకోవచ్చు.*
*కానీ, మనిషి రూపం అతని శరీరం పడిపోయాక కాలిబూడిదయిపోతుంది. వారితో ఉన్న అనుబంధాన్ని తలచుకునే క్రమంలోనూ ఆ పోయిన వ్యక్తుల శరీరాలు మనోఫలకంపై కదలాడుతుంటాయి.*
✅*ఈ శరీరాల స్మరణ నిత్యం జరుగుతూ ఉండటం వల్ల మళ్లీ మళ్లీ శరీరాలు ధరించాల్సి వస్తున్నది. అంటే జన్మ పరంపరలు కొనసాగడానికి ఇదీ ఒక కారణం.*
*ఎప్పుడు రాలిపోతాయో తెలియని శరీరాల గురించి ఇంత వెర్రి అభిమానం ఎందుకు? దుఃఖం కలుగుతున్నప్పటికీ ఎందుకు తొలగించుకోవడం లేదు? అని ప్రశ్నించుకోవాలి.*
*శరీరాలు పతనం చెందకుండా ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది కదా, అంటారా! అందుకోసం మనిషి శాశ్వతంగా జీవించే ఉపాయం కావాలి. భూమిపై శాశ్వతంగా ఉండిపోవాలన్న తపన అనాది నుంచి ఉన్నదే! అందుకే కదా, హిరణ్యకశిపుడు, రావణుడు తదితరులు ఘోర తపస్సులు చేసి వరాలు పొందింది.*
*అయినా, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు అన్నది సృష్టి నియమం. దాన్ని అనుసరించి ఎన్ని వరాలు పొందినా, ఇంకెన్ని మాయోపాయాలు చేసినా అంతిమంగా వారి శరీరాలు కూలిపోయాయి. ఏతావాతా శరీరాలను శాశ్వతంగా నిలబెట్టాలన్న అభిప్రాయం తప్పని తేలుతున్నది.*
*ఇక ఇప్పుడు మిగిలింది స్మృతులు. అవి విజృంభించే మనసు. వీటిని సరిదిద్దుకోవలసింది మనమే. అదెలాగంటే, మనసులోంచి మానవ శరీరాలను, తత్సంబంధ జ్ఞాపకాలను నిర్దాక్షిణ్యంగా తరిమికొట్టాలి.*
*ఇది ఒకే పద్ధతి వల్ల మాత్రమే సాధ్యం. భగవద్రూపాలు బంధ కారణాలు కావు. విముక్తి హేతువులు. కాబట్టి, దివ్యమైన భగవంతుడి రూపాలతో, అమూల్యమైన స్మృతులతో, సత్యమైన అనుభూతులతో రేయింబవళ్లూ మనసును నింపగలగాలి. *
*అప్పుడు నిరతిశయానందం మనిషికి సొంతం అవుతుందనడంలో సందేహం లేదు. భగవంతుడి రూపాన్ని, భావనను మనసులో సదా నిలుపుకోగలిగితే జీవితానికి సార్థకత కలుగుతుంది.*
*అపుడు ఈ శరీరం ఎప్పుడు పడిపోయినా, మళ్లీ శరీరాన్ని ధరించే జన్మ పరంపర చక్రం నుంచి విముక్తి లభిస్తుంది.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏















